Hyderabad: బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: పోక్సో కేసులో భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని ముఠా గోపాల్ డిమాండ్!

Hyderabad: బండి సంజయ్ తనయుడు భగీరథ్‌ను పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం.

GIRI, CENTRAL ZONE
Published on: 11 May 2026 5:45 PM IST
Hyderabad: బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: పోక్సో కేసులో భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని ముఠా గోపాల్ డిమాండ్!
X

ముషీరాబాద్ (హైదరాబాద్): కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ తనయుడు సాయి భగీరథ్‌ ను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినా 24 గంటల్లో అరెస్టు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మండి పడ్డారు.

ముషిరాబాద్‌ రాంనగర్‌ చౌరస్తా వద్ద బండి సంజయ్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడాతూ రాష్ట్రంలో బీజేపీ నాయకుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని దుయ్యబట్టారు. గతంలో కూడా సాయి భగీరథ్‌ పై ఎన్నో కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అంతే కాకుండా బీజేపీ నాయకులకు సీఎం కొమ్ముకాస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌ రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టి సాయి భగీరథ్‌ ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు చేపడతామని హెచ్చరించారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story