Hyderabad: చేనేత చీరల స్టోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాంకర్ సుమ
Hyderabad: హైదరాబాద్ జుబ్లీహిల్స్ రోడ్ నెం.59లో గద్వాల వీవర్స్ సొసైటీ సారీ హౌస్‌ను ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్, ప్రముఖ యాంకర్ సుమ ఘనంగా ప్రారంభించారు.
Hyderabad: చేనేత చీరల స్టోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాంకర్ సుమ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.59లో నూతనంగా ఏర్పాటు చేసిన గద్వాల వీవర్స్ సొసైటీ సారీ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొనగా, ప్రముఖ యాంకర్ సుమ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ చేనేత రంగం రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. గద్వాల చేనేత కళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి సారీ హౌస్‌లు దోహదపడతాయని పేర్కొన్నారు. నేత కార్మికుల సంక్షేమం, చేనేత ఉత్పత్తుల ప్రాచుర్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రముఖ యాంకర్ సుమ మాట్లాడుతూ, గద్వాల చేనేత కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా సారీ హౌస్ ఏర్పాటు కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా వేలాది మంది నేత కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. గద్వాల చీరలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాంకర్ సుమతో కలిసి సారీ హౌస్‌ను ప్రారంభించి, ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల గద్వాల చీరలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, చేనేత కార్మికులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




