Jubilee Hills: రహమత్‌నగర్ డివిజన్‌లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సుడిగాలి పర్యటన

Jubilee Hills: 56 బస్తీలకు త్వరలోనే తాగునీటి సరఫరా.. పైప్‌లైన్ పనులను కాలినడకన పరిశీలించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

RAJESH,	WEST ZONE
Published on: 17 Jun 2026 5:21 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: రహమత్‌నగర్ డివిజన్‌లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సుడిగాలి పర్యటన

Jubilee Hills: నేడు రహమత్‌నగర్ డివిజన్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్ జలమండలి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు..

▪️ నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 56 బస్తీలకు ఎస్‌పీఆర్ హిల్స్ రిజర్వాయర్ నుంచి తాగునీటి సరఫరా అందించే చర్యలను వేగవంతం చేసి, అతి త్వరలో ప్రజల నీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు..

▪️ అనంతరం ఎస్‌పీఆర్ హిల్స్ జలమండలి కార్యాలయం నుంచి ఆటో స్టాండ్, కార్మిక్‌నగర్ వరకు కొనసాగుతున్న వాటర్ పైప్‌లైన్ పనులను కాలినడకన పర్యవేక్షించారు.

▪️ పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు..

▪️ రహమత్‌నగర్ డివిజన్‌లో చేపడుతున్న నీటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను ఎమ్మెల్యే గారు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

▪️త్రాగునిటీ పైప్‌లైన్ పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

▪️ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు.

▪️ ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని, డివిజన్‌లోని ప్రతి బస్తీకి మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గారు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story