Hyderabad: యూసుఫ్‌గూడ కాంగ్రెస్ ఆఫీస్‌లో ఎస్.ఐ.ఆర్ సమీక్ష ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Hyderabad: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ సమీక్ష. ప్రతి 5 బూత్‌లకు ఒక కో-ఆర్డినేటర్ నియామకం. ఇంటింటికీ వెళ్లి ఫారాలు నింపాలని బీఎల్ఏలకు ఆదేశం.

RAJESH,	WEST ZONE
Published on: 4 July 2026 2:58 PM IST
Hyderabad
X

Hyderabad: యూసుఫ్‌గూడ కాంగ్రెస్ ఆఫీస్‌లో ఎస్.ఐ.ఆర్ సమీక్ష ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్: నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో S.I.R పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ. నవీన్ యాదవ్ గారు బూత్ స్థాయి కార్యకలాపాలపై కీలక సూచనలు చేశారు.

నియోజకవర్గంలోని ప్రతి ఐదు బూత్‌లకు ఒక కో-ఆర్డినేటర్‌ను నియమించారు. అలాగే ప్రతి డివిజన్‌లో పనిచేస్తున్న BLAల సమన్వయం కోసం కో-ఆర్డినేటర్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ప్రజలకు పంపిణీ చేసిన దరఖాస్తు ఫారమ్‌లలో ఎన్ని నింపించామో, ఎన్ని తిరిగి సేకరించామో అనే వివరాలను ప్రతిరోజూ సాయంత్రం సంబంధిత కో-ఆర్డినేటర్‌లకు అందజేయాలని సూచించారు.

ప్రతి కో-ఆర్డినేటర్ తమ పరిధిలోని BLAల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి BLA క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసి పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేలా పనిచేయాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు.

అదేవిధంగా, ప్రతి BLA తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వం అందిస్తున్న దరఖాస్తు ఫారమ్‌లను నింపాలని సూచించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story