Rajendranagar: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్యే!
Rajendranagar: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నూతన 'చేయూత' పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ పంపిణీ చేశారు.
Rajendranagar: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్యే!
Rajendranagar: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఘనంగా నూతన ‘చేయూత’ పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా, రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ‘చేయూత’ పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) ఆడిటోరియంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి. ప్రకాష్ గౌడ్ నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థిక భద్రత మరియు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు మరియు వివిధ వృత్తులపై ఆధారపడిన అర్హులైన వారికి చేయూత పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని పేర్కొన్నారు.
నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం పెన్షన్ నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు, సంబంధిత సిబ్బంది మరియు నూతన పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.




