Shamshabad: అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారం!
Shamshabad: కాటేదాన్ జెడ్పీ పాఠశాలలో అక్షయపాత్ర సాయంతో అల్పాహార పథకం ప్రారంభం: ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
Shamshabad: అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారం!
Shamshabad: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో విద్యార్థుల సంక్షేమానికి మరో ముందడుగు పడింది. మైలర్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ గణేష్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం, అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో అల్పాహార పథకాన్ని ప్రారంభించారు.
విద్యాశాఖ అధికారులు, రాజేంద్రనగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు.
విద్యార్థులు ఉదయం పూట పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత సాధిస్తారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం, అక్షయ పాత్ర ఫౌండేషన్ కలిసి అల్పాహార పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.




