Meerpet: మీర్పేట్ సాయి సామ్రాట్ నగర్ కాలనీలో తీరిన డ్రైనేజీ కష్టం
Meerpet: జీహెచ్‌ఎంసీ బడంగ్‌పేట్ 60వ డివిజన్ మీర్పేట్ సాయి సామ్రాట్ నగర్ కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను రూ.25 లక్షల వ్యయంతో పరిష్కారం.
Meerpet: మీర్పేట్ సాయి సామ్రాట్ నగర్ కాలనీలో తీరిన డ్రైనేజీ కష్టం
Meerpet: జీహెచ్‌ఎంసీ బడంగ్‌పేట్ 60వ డివిజన్ పరిధిలోని మీర్పేట్ సాయి సామ్రాట్ నగర్ కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్యను రూ.25 లక్షల వ్యయంతో శాశ్వతంగా పరిష్కరించినందుకు కృతజ్ఞతగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కాలనీవాసులు ఘనంగా సత్కరించారు.
మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యేకు శాలువా కప్పి, మెమెంటో అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసే నాయకులకు ప్రజలు ఆదరణ, అవకాశం కల్పించాలని ఆమె సూచించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
అలాగే జిల్లెలగూడ, మీర్పేట్ ప్రాంతాల్లో ఇంటి పన్నులు అధికంగా ఉన్నాయని, ఈ ప్రాంతాలు జీహెచ్‌ఎంసీలో విలీనం అయిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఆస్తి పన్నులను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏనుగుల అనిత అనిల్ కుమార్ యాదవ్, సిద్దాల బీరప్ప, సునీత బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.




