Secunderabad: కంటోన్మెంట్‌లో 35 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ!
Secunderabad: కంటోన్మెంట్‌లో 35 కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.. పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండ.
Secunderabad: కంటోన్మెంట్‌లో 35 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ!
Secunderabad: సికింద్రాబాద్ 35 కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ, పేద మధ్యతరగతి కుటుంబాలకు CMRF అండగా నిలుస్తోందికంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 35 కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను శనివారం పికెట్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ అనారోగ్యంతో వైద్యం చేయించుకునే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని కుటుంబాలకు CMRF ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు.
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, CMRF లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




