Secunderabad: ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి సేవ చేసేవారే నిజమైన నాయకులు

Secunderabad: ఉచిత హెల్త్ క్యాంప్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సందర్శించి నిర్వాహకులను అభినందించారు.

SRIKANTH, TANDUR
Published on: 17 May 2026 3:20 PM IST
Secunderabad
X

Secunderabad: ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి సేవ చేసేవారే నిజమైన నాయకులు

సికింద్రాబాద్: ప్రజా జీవితంలో ప్రజలు బాగుండాలంటే ప్రజా సేవ చేసే నాయకులు ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తేనే ప్రజా నాయకులు అవుతారని కంటోన్మెంట్ ఏం ఎల్ ఏ శ్రీగణేష్ అన్నారు…మోండా డివిజన్ లో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళ తోపాటు మెగా హెల్త్ క్యాంపు ముఖ్య అతిథిగా ఏం ఎల్ ఏ శ్రీగణేష్ హాజరయ్యారు..మారేడుపల్లి మల్టీ పర్పస్ హాల్లో సంతోష్ యాదవ్ జాబ్ మేళ ..అంబేద్కర్ నగర్ లో బద్రినాథ్ యాదవ్ హెల్త్ క్యాంప్ సందర్శించి నిర్వాహకులను ఏం ఎల్ ఏ అభినందించారు.

ప్రజలకు ఉద్యోగం తోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కనుక తమ కాంగ్రెస్ నాయకులు సొంత నిధులతో జాబ్ మేళాలు..వాటర్ క్యాంపులు..హెల్త్ క్యాంపుల తోపాటు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుండడం సంతోషంగా ఉందని ఏం ఎల్ ఏ శ్రీగణేష్ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులు రాకుండా ఏనీ టైమ్ పబ్లిక్ లీడర్లు ఉండి ప్రజా సేవ చేస్తేనే ప్రజలు గుర్తిస్తారని ఏం ఎల్ ఏ శ్రీగణేష్ సూచించారు.

SRIKANTH, TANDUR

SRIKANTH, TANDUR

Next Story