Secunderabad: కంటోన్మెంట్‌లో ఓటరు జాబితా ఎస్‌ఐఆర్ వార్డు సభ.. హాజరైన ఎమ్మెల్యే శ్రీగణేష్
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రసూల్‌పురలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు జాబితా ఎస్‌ఐఆర్ వార్డు సభలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు.
Secunderabad: కంటోన్మెంట్‌లో ఓటరు జాబితా ఎస్‌ఐఆర్ వార్డు సభ.. హాజరైన ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై రసూల్‌పురలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వార్డు సభలు నిర్వహించారు.
గన్‌బజార్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన 2 వ వార్డు సభలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని సర్ ప్రక్రియలో బి ఎల్ ఓ లు చేస్తున్న సేవలను అభినందించారు. బి యల్ ఓ లతో ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఓటర్ జాబితాలో పేరు లేని వారికి అవగాహన కల్పించాలని, నోటీసులు అందుకున్న వారికి ప్రక్రియపై పూర్తి సమాచారం అందించాలని, SIRపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని బి ఎల్ ఓ లకు సూచించారు.
బి ఎల్ ఓ లకు రావాల్సిన బకాయిలను ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు. బి ఎల్ ఓ సూపర్‌వైజర్లు, బి ఎల్ ఏ లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




