LB Nagar: దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి – ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
LB Nagar: ఎల్‌బీనగర్‌లో దివ్యాంగులతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమావేశం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్.
LB Nagar: దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి – ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎల్‌బీనగర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి దివ్యాంగులకు న్యాయం చేయాలని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులను మోసం చేసిందని ఆయన విమర్శించారు.
ఎల్‌బీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో NPDO (Network of Persons with Disability Organisations) ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సుధీర్‌రెడ్డి అన్నారు. దివ్యాంగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు, NPDO ప్రతినిధులు పాల్గొన్నారు.




