Hyderabad: మన్సూరాబాద్ డంపింగ్ యార్డ్ దుర్వాసనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం!
Hyderabad: మన్సూరాబాద్ డంపింగ్ యార్డ్ దుర్వాసనతో ప్రజలు పడుతున్న ఇబ్బందిపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జోనల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించి, కఠిన చర్యలకు ఆదేశించారు.
Hyderabad: మన్సూరాబాద్ డంపింగ్ యార్డ్ దుర్వాసనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం!
Hyderabad: * మన్సూరాబాద్ డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డ్ పరిసరాల్లో వ్యర్థాలు, మురుగునీరు, రక్తం, కొవ్వు పదార్థాలు పేరుకుపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాలు కురిసినప్పుడు దుర్వాసన మరింత పెరుగుతోందని, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జోనల్ కమిషనర్ వికాస్ మహాతోతో కలిసి డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించారు.
రాత్రివేళల్లో రోడ్లపై వ్యర్థాలు పడేస్తున్న వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించాలని ఎమ్మెల్యే సూచించారు. గతంలో రూ.6 కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మించామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమంగా వ్యర్థాలు డంప్ చేసే వాహనాలపై చర్యలు తీసుకున్నామని సుధీర్‌రెడ్డి తెలిపారు.
హైడ్రా, జీహెచ్ఎంసీ తదితర శాఖల సమన్వయంతో మురుగునీటిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటివరకు దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలకు దుర్వాసన సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దీనిపై స్పందించిన జోనల్ కమిషనర్ వికాస్ మహాతో.. రాత్రివేళల్లో వచ్చే వాహనాలపై నిఘా పెంచుతామని, రోడ్ల పక్కన వ్యర్థాలు డంపింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




