LB Nagar: మన్సూరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే!
LB Nagar: ఎల్బీనగర్ మన్సూరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పర్యావరణ హితంగా ప్రత్యేక కుంటల ఏర్పాటు.
LB Nagar: మన్సూరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే!
LB Nagar: ఎల్బీనగర్ మురికి నీటిలో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆలోచన మేరకు మన్సూరాబాద్‌లో ప్రత్యేకంగా నీటి కుంటను ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. బోర్ల ద్వారా కుంటలోకి నీటిని సరఫరా చేయడంతో నిమజ్జన సమయంలో నీరు కలుషితం కాకుండా, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఈ కుంట ఉపయోగపడుతోంది. మన్సూరాబాద్ తో పాటు నియోజక వర్గంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కుంటలను ఏర్పాటు చేశారు.
ప్రతి ఏడాది ఈ కుంటలో వేలాది గణేశ విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తుండటంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ కార్యక్రమం లో డివిజన్ బీర్ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, తూర్పాటి చిరంజీవి, జగదీష్ యాదవ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, బాలరాజ్ గౌడ్ గార్లు తదితరులు పాల్గొన్నారు.




