LB Nagar: ప్రభుత్వ హామీలు ఏమయ్యాయి? - ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
LB Nagar: ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నిరుద్యోగులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
LB Nagar: ప్రభుత్వ హామీలు ఏమయ్యాయి? - ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
LB Nagar: ఎల్బీనగర్ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ నిరుద్యోగ యువతతో కలిసి దిల్ సుఖ్ నగర్ వరకు వారితో పాదయాత్ర నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు.
మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ దానిపై స్పష్టత లేకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందన్నారు.
అదేవిధంగా జీవో 29 మరియు జీవో 46లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామకాల్లో చోటుచేసుకున్న అనుమానాలపై సిట్ ఎంక్వయిరీ నిర్వహించి పారదర్శకంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ భారస నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, గడ్డిఆన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, రమణారెడ్డి, శైలజ, గండి సన్నీ యాదవ్, ప్రతీక్, శివరాం, విక్కీ, సమ్ము రాము, ప్రదీప్, రవీందర్ రెడ్డి మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.




