LB Nagar: ఎల్బీనగర్ చింతలకుంటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!
LB Nagar: ఎల్బీనగర్ చింతలకుంటలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, నాయకులు.
LB Nagar: ఎల్బీనగర్ చింతలకుంటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!
LB Nagar: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చింతలకుంటలోని ఆమె విగ్రహానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమని అన్నారు.
సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విట్టల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




