Sanathnagar: తలసాని: పద్మారావు నగర్‌లో ₹49 లక్షల పనులు ప్రారంభం!

Sanathnagar: పద్మారావునగర్‌లో రూ. 49 లక్షల ఫుట్‌పాత్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని. కమ్యూనిటీ హాల్ నిర్మాణ నిధులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశం.

Srikanth, Secunderabad
Published on: 30 July 2026 2:50 PM IST
Sanathnagar
X

Sanathnagar: తలసాని: పద్మారావు నగర్‌లో ₹49 లక్షల పనులు ప్రారంభం!

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం పద్మారావు నగర్ లోని వెంకటాపురం కాలనీలో 49 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫుట్ పాత్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం అసంపూర్తిగా నిర్మాణం జరిగిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. 45 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టగా, నిధులు సరిపోకపోవడంతో పనులు నిలిపి వేశారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న జోనల్ కమిషనర్ మంగ తాయారు ను ఆదేశించారు. అదేవిధంగా కాలనీ మహిళల అవసరాల కోసం మరో అంతస్తు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంకటాపురం కాలనీ అభివృద్ధి కి చేసిన కృషి, అందించిన సహకారాన్ని గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా వాటిని పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. వెంకటాపురం కాలనీలో తాను వచ్చిన తర్వాతనే డ్రైనేజీ, వాటర్ లైన్, రోడ్ల అభివృద్ధి వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ కాలనీ గా తీర్చిదిద్దిన విషయాన్ని గుర్తు చేశారు. పార్క్ ను కూడా ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసి కాలనీ ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చినట్లు వివరించారు. సమస్య ఎదైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మంగ తాయారు, DE నాయక్, వాటర్ వర్క్స్ DGM వెంకట్ రెడ్డి, AE మురళి, ఎలెక్ట్రికల్ AE రాజు, హార్టికల్చర్ అధికారి సత్యనారాయణ, పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు వెంకటరమణ, ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, కొత్తూరు వెంకట్, కాలనీ వాసులు వజీర్ మోహన్, శ్రీనివాస్, సత్యనారాయణ, నాగరాజు, మనోజ్, పద్మజ, సుష్మిత, అనితరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story