Hyderabad: సనత్ నగర్‌లో తలసాని సందడి.. పేద మహిళలకు మదర్స్ డే కానుకలు!
Hyderabad: సనత్ నగర్ బి.కె. గూడ పార్క్ వద్ద శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరల పంపిణీ.
Hyderabad: సనత్ నగర్‌లో తలసాని సందడి.. పేద మహిళలకు మదర్స్ డే కానుకలు!
Hyderabad: శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ లోని బి కె గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పేదలకు ఉచితంగా భోజనం వడ్డిస్తూ ఆకలి తీర్చడం, చాలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా మదర్స్ డే ను పురస్కరించుకుని పేద మహిళలకు చీరలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇవే కాకుండా ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పార్థసారధి, ఇతర సభ్యులను అభినందించారు.




