Hyderabad: జూబ్లీహిల్స్ వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

Hyderabad: పంజాగుట్ట, ఎల్లారెడ్డిగూడలో వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్.

RAJESH,	WEST ZONE
Published on: 8 July 2026 9:33 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్ వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

హైదరాబాద్: రాజన్న వేసిన బాటలో..రాజన్న ఆశయ సాధనలో..సంక్షేమమే మా సంకల్పంగా ముందుకు సాగుతాం.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.. రైతు బాంధవుడు, ప్రజా సంక్షేమ పాలకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా పంజాగుట్టతో పాటు ఎల్లారెడ్డిగూడలోని వైఎస్ఆర్ విగ్రహాలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ,

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు రైతుల సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత ప్రజానాయకుడని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడిగా వైఎస్ఆర్ చరిత్రలో నిలిచారన్నారు.

ప్రజాసేవే పరమావధిగా భావించి పాలన సాగించిన ఆయన ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం పంజాగుట్ట, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాల వద్ద పూలమాలలు సమర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ఆర్ ఆశయాలను, ప్రజాసంక్షేమ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story