Hyderabad: కార్మిక వర్గంలో బలమైన శక్తిగా ఎదుగుదాం కోదండరాం పిలుపు
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్మిక హక్కుల సంరక్షణకు బలమైన సంఘాన్ని నిర్మించాలని టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం పిలుపునిచ్చారు.
Hyderabad: కార్మిక వర్గంలో బలమైన శక్తిగా ఎదుగుదాం కోదండరాం పిలుపు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్మిక వర్గంలో తెలంగాణ జన సమితి అనుబంధ కార్మిక యూనియన్ను బలమైన శక్తిగా నిర్మించడానికి శాశక్తుల కృషి చేయాలని ఎమ్మెల్సీ కోదండరాం విజ్ఞప్తి చేశారు. గురువారం టి జే ఎస్ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ కార్మిక హక్కుల సంరక్షణ కోసం బలమైన సంఘాన్ని నిర్మించాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనంకై ఉద్యమించాలని ఆయన కోరారు. ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలలో అవకతకులపై స్పందించాలని, రాష్ట్రవ్యాప్తంగా బలమైన కార్మిక సంఘ నిర్మాణం చేపట్టాలని దానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.
జిహెచ్ఎంసి పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కోదండరాం వెల్లడించారు. యూనియన్ నిర్మాణాన్ని అన్ని జోన్లలో అన్ని సర్కిల్లో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నరసయ్య, జన సమితి కార్మిక విభాగం రాష్ట్ర నాయకుడు ఆకుల శ్రీనివాస్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మహమ్మద్ జహీర్, మాధవరెడ్డి, బాలరాజు, జగదీష్, బలవంత రెడ్డి, బాల నరసింహ, కృష్ణ, సంజీవ్, మురళి, యాదగిరి, వాటర్ వర్క్స్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ నాయకుడు బాలకృష్ణారెడ్డి, తెలంగాణ బస్తీ దావకాన కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ నాయకులు అంజాద్, ఉప్పలయ్య, జన సమితి నగర ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, నగర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




