Kalwakurthy: మొబైల్ ఫిల్మ్‌మేకింగ్‌తో విస్తృత అవకాశాలు: టాస్క్ సీఓఓ
Kalwakurthy: హైదరాబాద్‌లో టాస్క్ ఆధ్వర్యంలో మొబైల్ ఫిల్మ్‌మేకింగ్‌పై నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో 56 మంది విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేశారు.
Kalwakurthy: మొబైల్ ఫిల్మ్‌మేకింగ్‌తో విస్తృత అవకాశాలు: టాస్క్ సీఓఓ
నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి నియోజకవర్గం ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు టాస్క్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టాస్క్ కార్యాలయంలో “మొబైల్ ఫిల్మ్‌మేకింగ్ అండ్ సినిమాటోగ్రఫీ”పై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన 56 మంది విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వర్క్‌షాప్‌లో మొబైల్ ఫిల్మ్‌మేకింగ్, ఫోటోగ్రఫీ ప్రాథమిక అంశాలు, కెమెరా టెక్నిక్స్, ఫ్రేమింగ్, లైటింగ్, విజువల్ స్టోరీటెల్లింగ్, ప్రాథమిక సినిమాటోగ్రఫీ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు. స్మార్ట్‌ఫోన్‌తోనే నాణ్యమైన విజువల్స్ రూపొందించడం, కథను ఆకట్టుకునేలా చిత్రీకరించే విధానాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఆసక్తులు, నేర్చుకున్న అంశాలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సాంకేతికత యువతకు ఎన్నో కొత్త అవకాశాలను అందిస్తోందన్నారు.
ఖరీదైన కెమెరాలు, పరికరాలు లేకుండానే స్మార్ట్‌ఫోన్‌తో మంచి ఆలోచనను, కథను, విజువల్‌ను ప్రపంచానికి చూపించే అవకాశం ఉందని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ఫోటోగ్రఫీ, ఫిల్మ్‌మేకింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చని అన్నారు.
వర్క్‌షాప్‌లో నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టాలని, సృజనాత్మక ఆలోచనతో పాటు నిరంతర సాధన చేస్తే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం వర్క్‌షాప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన 56 మంది విద్యార్థులకు సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌మేకింగ్ ట్రైనర్ రోషన్‌తో పాటు టాస్క్ ప్రతినిధులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.




