Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం.. పేలిన ఫోన్ బ్యాటరీ!
Hyderabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీల సమయంలో ప్రయాణికుడి బ్యాగులో సెల్‌ఫోన్ బ్యాటరీ పేలింది.
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం.. పేలిన ఫోన్ బ్యాటరీ!
Hyderabad: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో మంగళవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. విమానం ఎక్కే ముందు నిబంధనల ప్రకారం సీఐఎస్‌ఎఫ్ (CISF) సిబ్బంది అతడి లగేజీని తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అతడి బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు, పొగ రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.
విచారణ చేపట్టిన పోలీసులు:
భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ పేలడానికి గల కారణం షార్ట్ సర్క్యూటా లేక ఇతర సాంకేతిక లోపాలా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై విమానాశ్రయ భద్రతా అధికారులు నివేదిక కోరారు.




