Malkajgiri: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌పై తాడోపేడో తేల్చుకుంటాం ఎంపీ ఈటల
Malkajgiri: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్; కలుషిత వాయువులతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన.
Malkajgiri: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌పై తాడోపేడో తేల్చుకుంటాం ఎంపీ ఈటల
Malkajgiri: జవహర్ నగర్ ప్రజల బాధ అనుభవించే వాళ్ళకే మాత్రమే తెలుస్తుంది.. జవహర్ అంటే గతంలో పచ్చటి పొలాలతో కలకలాడేవి.. అప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు శాపమైపోయోంది.. రేవంత్ రెడ్డి రంగుల ప్రపంచాన్ని చూపిస్తున్నారు..
ఇక్కడి మహిళలకు అబార్షన్ లు అవుతున్నాయి.అని చెపుతుంటే కళ్ళవెంట నీళ్ళు వస్తున్నాయి.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వాసన సమీర్పేట్ వరకు వస్తుంది.. ఒకేసారి 12 లక్షల కారులు రిలీజ్ చేసే మీథేన్ వాయువును ఒక గంటలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తో రిలీజ్ అవుతుంది..
కార్బన్ డయాక్సైడ్ కంటే 80 రెట్లు ఎక్కువ ప్రమాదకరం మీథేన్ ఉంది.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎపెక్ట్ తో అత్యధిక క్యాన్సర్, గర్భస్రావాలు, ఊపిరి తిత్తుల సమస్యలు ఇక్కడే ఉన్నాయి.. 60 ఏళ్లకే ఇక్కడి ప్రజలు చనిపోతున్నారు..
ఇక్కడి ప్రజలు గతి లేక ఇక్కడ ఉంటున్నారు.. ప్రభుత్వం జూబ్లీహిల్స్ వాసుల కోసం కాదు జవహర్ నగర్ , బాలాజీ నగర్ ప్రజల కోసం ఉండాలి.. రామ్ కో CSR డబ్బులు జవహర్ నగర్ ప్రజలకి వాడటం లేదు..ఆంధ్రప్రదేశ్ కి పోతున్నాయి..
సియోల్ నది కోసం చైనా కి వెళ్లాల్సిన అవసరం లేదు.. బాలాజీ నగర్ డంపింగ్ యార్డ్ పోవాలి.. రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే పెద్ద సమస్య మీకు లేదు.. హైదరాబాద్ నుండి 70 శాతం ఆదాయం వస్తుంది..
హైదరాబాద్ లో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య కి పరిష్కారం లేదా.. రాంకీ కి వేల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడం లేదా రేవంత్ రెడ్డి.. మా ఎంపీలం అంతా మీకు సపోర్ట్ చేస్తాం.. మా ఎంపీలం అంత కేంద్ర మంత్రులని కలిశాం..
హైదరాబాద్ నగరంలో ట్రాపిక్ సమస్య పోవాలని వేల కోట్లు ఖర్చు చేస్తుంది కేంద్రం.. కేంద్ర ప్రభుత్వంతో నే హైదరాబాద్ నగరంలోని ప్లయ్ ఓవర్ లు కడుతున్నారు.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు పై తాడో పేడో తేల్చుకుంటాం..
స్వార్ధం కోసం, బ్లాక్ మెయిల్ కోసం ఉద్యమాలు చేసేవారు ఉంటారు.. మేము నిస్వార్థంగా ఉద్యమం చేస్తాం.. మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల కోసం రెండు రోజుల పాటు దీక్ష చేశాం.. విద్యార్థుల ఫీజ్ రియంబర్స్ మెంట్ కోసం ఉద్యమాలు చేసింది బీజేపీ..
ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. హైడ్రా వచ్చిన తర్వాత లక్షల మంది ప్రజలు కట్టుకున్న ఇళ్లు కూలుస్తారని నేను భావించా.. మూడు నెలల పాటు నేను చెరువులు వెంట నిర్మించుకున్న వారి వెంట తిరిగాను..
హైడ్రాని ఆపగలిగింది మేము.. మూసి ని గొప్పగా నిర్మాణం చేయడానికి ఇల్లు కూల్చాల్సిన అవసరం లేదు.. మల్టీప్లెక్స్ లు కట్టడానికి ఇళ్లు కూలుతున్నారు.. బీజేపీ మూసి ప్రాంతాల్లో పడుకొని ఇల్లు కూల్చాడని ఆపాము..
22a పై బీజేపీ పోరాటం తో తప్పైంది అని ప్రభుత్వం ఒప్పుకుంది.. మాకు తెలంగాణ ప్రజల పై ప్రేమ .. జవహర్ నగర్ డంపింగ్ సమస్య పరిష్కారం చేయకపోతే మా పోరాటాని మరింత ఉధృతం చేస్తాం..




