Hyderabad: లక్ష్మి హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకలు.. పాల్గొన్న ఎంపీ ఈటల
Hyderabad: వనస్థలిపురం లక్ష్మి హాస్పిటల్లో రీహాబిలిటేషన్ వార్డును ప్రారంభించిన ఎంపీ ఈటల రాజేందర్. కరోనా కాలంలో వైద్యుల త్యాగాలను కొనియాడిన నేత.
Hyderabad: లక్ష్మి హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకలు.. పాల్గొన్న ఎంపీ ఈటల
హైదరాబాద్: వనస్థలిపురం లక్ష్మి హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, బిజెపి నాయకులు శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి, లచ్చిరెడ్డి, కొప్పుల నర్సింహ రెడ్డి, రానా ప్రతాప్, డాక్టర్స్ శ్రీకాంత్, శ్వేత, వంశీ, సృజన. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు అందించారు.
పలువురు డాక్టర్స్ ను సన్మానించారు. హాస్పిటల్ లో రీహాబిలిటేషన్ వార్డును ప్రారంభించారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. డాక్టర్లను భగవంతునితో పోలుస్తారు. వైద్య నారాయణో హరి అంటారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడతారు.
ఎంత మంది వచ్చినా ఓపికతో సేవచేస్తారు. వైద్యులు త్యాగధనులు. కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు సైతం మొదటిసారి భయపడ్డారు. కరోనా సమయంలో మన దగ్గర మహేంద్ర హిల్స్లో మొదటి పేషెంట్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ వారందరూ భయపడ్డారు.
వెంటనే గాంధీకి షిఫ్ట్ చేశాము. వైద్యం అందించడం కోసం అందరూ భయపడ్డ సమయంలో.. డిపార్ట్మెంట్ కెప్టెన్ కాబట్టి స్వయంగా నేనే ఆసుపత్రికి వెళ్ళి చూశా. మేము ఉన్నాం అని భరోసా నింపాను. ధైర్యమే దీనికి మందు అని చెప్పాను. ఒక యుద్ధంలాగ చేసి పీపీఈ కిట్స్, శానిటైజర్లు, మందులు తెప్పించాము.
మనిషి నేను ఎంత గొప్ప అని చెప్పుకున్నా ప్రకృతి ప్రకోపిస్తే ఎలా విలవిలలాడతారో కరోనా సమయంలో కళ్ళారా చూశాము. అలాంటి ప్రాణాలకు తెగించి సేవలందించిన డాక్టర్లు వైద్య సిబ్బంది శానిటేషన్ సిబ్బంది అందరికీ మరోసారి వందనాలు. డాక్టర్స్ డే సందర్భంగా మరోసారి అందరికీ శుభాకాంక్షలు.




