Hyderabad: చందానగర్‌లో ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర': ఎంపీ కే. లక్ష్మణ్!

Hyderabad: చందానగర్‌లో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థాన పురస్కరించుకుని 'సేవా జ్యోతి యాత్ర'. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 7 Oct 2026 9:27 PM IST
Hyderabad
X

Hyderabad: చందానగర్‌లో ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర': ఎంపీ కే. లక్ష్మణ్!

Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవకుడిగా 25 ఏళ్ల నిరంతరాయ సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్‌లో ‘సేవా జ్యోతి యాత్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ లీడర్, ఎంపీ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన నరేంద్ర మోదీ సుపరిపాలన ప్రస్థానం, నేడు దేశ ప్రధానిగా దిగ్విజయంగా కొనసాగుతోందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ఈ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవా జ్యోతి యాత్రలు’, ‘వికసిత్ భారత్ సంకల్ప సభలు’ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాత్రల్లో ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ‘వికసిత్ భారత్ 2047’ సాధన కోసం ప్రతిజ్ఞ చేస్తున్నారని వెల్లడించారు.

ఆర్థిక వ్యవస్థ నుంచి సంక్షేమం వరకు..

మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఎంపీ కొనియాడారు. మౌలిక వసతులు, రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్ల విస్తరణలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. జేఏఎం (JAM), ఉచిత రేషన్, పీఎం కిసాన్, ఉజ్వల, గృహ నిర్మాణం వంటి పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందారని తెలిపారు.

అలాగే ఆయుష్మాన్ భారత్, లఖ్‌పతి దీదీ, పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ వంటి పథకాలు పేదలు, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచాయని వివరించారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY