Hyderabad: వయోపరిమితి పెంచిన తర్వాతే పోలీస్ నియామకాలు చేపట్టాలి.
Hyderabad: పోలీస్ నియామకాల్లో వయోపరిమితిని పెంచిన తర్వాతే రిక్రూట్‌మెంట్ చేపట్టాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Hyderabad: వయోపరిమితి పెంచిన తర్వాతే పోలీస్ నియామకాలు చేపట్టాలి.
వయోపరిమితి పెంచి పోలీస్ నియామకాలు చేపట్టాలి
వయోపరిమితి పెంచిన తర్వాతే పోలీస్ నియామకాలను చేపట్టాలని రాజ్యసభ సభ్యులు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమాజిగూడ, ప్రెస్ క్లబ్ లో ఉద్యోగ అన్వేషణలో ఉన్న పోలీస్ అభ్యర్థులు అశోక్ సార్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్వహించిన విధంగానే పాత జీవో ప్రకారమే రిక్రూట్మెంట్ చేపట్టాలని కోరారు. పోలీస్ కావాలన్నా ఆకాంక్షతో ఇబ్బందుల కోర్చి శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు వయోపరిమితి పెంచడం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెశజాలకు పోకుండా వయోపరమతి పెంచి కానిస్టేబుల్ ఎస్సై నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పోలీస్ అభ్యర్థులకు అండగా ఉంటామని ఆర్ కృష్ణయ్య తెలిపారు.




