Hyderabad: బీజేపీ ఓట్ల దొంగతనానికి చెక్ పెడతాం.. ఎంపీ అనిల్ కుమార్

Hyderabad: ఓట్లను దొంగతనం చేసి బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

HARISH, TARNAKA
Published on: 14 Jun 2026 8:47 PM IST
Hyderabad
X

Hyderabad: బీజేపీ ఓట్ల దొంగతనానికి చెక్ పెడతాం.. ఎంపీ అనిల్ కుమార్

Hyderabad: ఓట్లను దొంగతనం చేసి బిజెపి పార్టీ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. లాలాపేట లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆదం సంతోష్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ బూత్ లెవల్ ఎజెంట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి, డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, టిపిసిసి ఉపాధ్యక్షులు కైలాష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలలో దాదాపు ఓట్లను దొంగతనం చేస్తున్నారన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూతులు ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి బూతులు అర్హులైన ప్రతి ఓటర్ను గుర్తించి ఓటరు జాబితాలో నమోదు చేయడం కొత్త ఓటర్ల పేర్లను చేర్చడం తప్పులను సవరించడం మరణించిన ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను తొలగించడం వంటి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.

దొంగ ఓట్లను అరికట్టడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ను మొదలుపెట్టామన్నారు. రాష్ట్రంలో ఓట్ల దొంగతనాన్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ లెవల్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకొని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని ప్రతి బూతులో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story