Hyderabad: ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటరు నమోదుకు ఎంపీ వద్దిరాజు పిలుపు!

Hyderabad: శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 6 లోగా ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 1 Oct 2026 7:09 AM IST
Hyderabad
X

Hyderabad: ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటరు నమోదుకు ఎంపీ వద్దిరాజు పిలుపు!

Hyderabad: శాసనమండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పట్టభద్రులను కోరారు.నల్లగొండ-ఖమ్మం-వరంగల్, హైదరాబాద్ -రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరుగుతాయన్నారు.

ఈ ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఫారం -18 పూర్తి చేసి నవంబర్ 6వతేదీ లోగా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసి ఓటు హక్కు పొందాల్సిందిగా ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర కోరారు."మన ఓటు-మన హక్కు"నినాదంతో 2023 నవంబర్ నాటికి ఏదేనీ డిగ్రీ లేదా దానికి సమానమైన డిప్లొమా పూర్తి చేసిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

పట్టభద్రుల ఎన్నికల్లో ఇంతకుముందు ఓటేసిన వాళ్లు కూడా తమ పేర్లను తిరిగి నమోదు చేసుకోవలసి ఉంటుందని ఎంపీ రవిచంద్ర తెలిపారు.ఇందుకుగాను ఓటరు గుర్తింపు,ఆధార్ కార్డులతో పాటు డిగ్రీ/గ్రాడ్యుయేట్ ధృవీకరణ పత్రం,పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబరుతో తమ పేర్లను (ఓట్లు) నమోదు చేసుకోవాల్సిందిగా ఎంపీ వద్దిరాజు పట్టభద్రులను కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.