మల్కాజ్‌గిరిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.. మందకృష్ణ మాదిగ బర్త్‌డే వేడుకలు!

మల్కాజ్‌గిరి పరిధిలో ఎమ్మార్పీఎస్ (MRPS) ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

Bodike Manohar, Malkajgiri
Published on: 7 July 2026 3:14 PM IST
మల్కాజ్‌గిరిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.. మందకృష్ణ మాదిగ బర్త్‌డే వేడుకలు!
X

మల్కాజ్‌గిరిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.. మందకృష్ణ మాదిగ బర్త్‌డే వేడుకలు!

మల్కాజ్‌గిరి (మేడ్చల్ మల్కాజ్‌గిరి): మాది ఆకులే మానవాక్కులుగా ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని ఎమ్మార్పీఎస్ జాతీయా నాయకులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ తెలిపారు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా మల్కాజిగిరి పరిధిలోని వివిధ డివిజన్ లలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎమ్మార్పీఎస్ ,విహెచ్ పిఎస్,జర్నలిస్ట్ ,వివిధ అనుబంధ సంఘాలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అని తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 సంవత్సరాల క్రితం ఎమ్మార్పీఎస్ ను స్థాపించి అణగారిన పేదల కోసం, వికలాంగుల కోసం, మహిళల కోసం,విద్యార్థుల కోసం రాష్ట్రంలో,దేశంలో అనేక ఉద్యమాలను నిర్మించిన నాయకుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అని తెలిపారు.

మాదిగలకే కాకుండా అన్ని వర్గాల పేద ప్రజల సమస్యలపై ముందుండే నాయకుడని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షులు రామచంద్ర మాదిగ, ఎం జె పి రాష్ట్ర నాయకులు మనోహర్, విహెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులు ఎన్ వినయ్, మాదిగ సంక్షేమ సంఘ నాయకులు సంధి గారి నర్సింగరావు మాదిగ, యు రామచందర్, పి బలరాం, రామచెర్ల నర్సింగ్,పి పోశాలు, ఆర్ గణేష్, ప్రేమ్, ఇస్తారి, శంకర్, కాశన్న, పరశురాం కుమార్,గిరి,పి ప్రభాకర్ వికలాంగులు,మహిళలు వృదులు తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story