Hyderabad: మిసెస్ తెలంగాణ 2026 విజేత రీతూ అగర్వాల్ విజయోత్సవం!

Hyderabad: మిసెస్ తెలంగాణ 2026 విజేత రీతూ అగర్వాల్ సక్సెస్ మీట్. ఆత్మవిశ్వాసం, సరైన మార్గదర్శకత్వమే తన విజయానికి కారణమని వ్యాఖ్య.

RAJESH,	WEST ZONE
Published on: 16 Aug 2026 6:59 AM IST
Hyderabad
X

Hyderabad: మిసెస్ తెలంగాణ 2026 విజేత రీతూ అగర్వాల్ విజయోత్సవం!

Hyderabad: పట్టుదల, అంకితభావం కలిగిన ప్రతీ మహిళకు తాను సాధించిన విజయం అంకితమని మిసెస్ తెలంగాణ 2026 టైటిల్ విజేతరీతూ అగర్వాల్ అన్నారు. నగరంలోని నిజాంపేట ప్రాంతానికి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ రీతూ ఆగర్వాల్ ఇటీవల కొచ్చిలో ఓ సంస్థ నిర్వహించిన మిస్ సౌత్ ఇండియా, మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొని ప్రాంతీయ టైటిల్ అయిన మిసెస్ తెలంగాణ 2026ను దక్కించుకుంది.

ఈ సందర్భంగా బంజారాహిల్స్లో రీతూ అగర్వాల్ విజయోత్సవ సక్సెస్ మీట్) కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో తెలంగాణ ఇకత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని వివిధ రంగాల ప్రముఖులతో కలిసి రీతూని సత్కరించి అభినందనలు తెలిపారు.

రీతూ అగర్వాల్ మాట్లాడుతూ ఆత్మ విశ్వాసంతో పాటు సరైన మార్గదర్శకత్వం విజయానికి చేరుస్తుందని అభిప్రాయపడ్డారు. తన ప్రస్థా నంలో ఎదురైన అనుభవాలను వివరించారు. లక్ష్మికా గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ శారద, గ్లామోరా సంస్థ వ్యవస్థాపకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story