Kodangal: ముదిరాజుల గర్జన: గన్ పార్కుకు చేరుకున్న మహా పాదయాత్ర!

Kodangal: ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏలోకి మార్చాలని కోరుతూ చేపట్టిన మహా పాదయాత్ర హైదరాబాద్ గన్ పార్కుకు చేరుకుంది.

AKRAM PASHA , KODANGAL
Published on: 24 April 2026 11:22 AM IST
Kodangal
X

Kodangal: ముదిరాజుల గర్జన: గన్ పార్కుకు చేరుకున్న మహా పాదయాత్ర!

Kodangal: ముదిరాజులను బిసి-డి నుండి బీసీ ఏ గ్రూపులోకి మార్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కూర వెంకటయ్య ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఈనెల 18 న ప్రారంభమై కొనసాగిన మహా పాదయాత్ర ఇవాళ హైదరాబాదులోని గన్ పార్కుకు చేరుకుంది. పాదయాత్రలో పాల్గొన్న ముదిరాజ్ సంఘం నాయకులను, ముదిరాజ్ నాయకులు పూలమాలలతో ఘనంగా సన్మానించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర వెంకటయ్య మాట్లాడుతూ..

గతంలో కేసీఆర్ ప్రభుత్వం ముదిరాజులను బిసి-డి నుండి బీసీఏలోకి మార్చుతామని మాట ఇచ్చి తప్పారని, దాని పర్యావసరంగా ముదిరాజులు ఏకమై కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపామని వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా ముదిరాజులను బిసి ఏలోకి మార్చుతామని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజులను బిసి-డి నుండి బీసీ ఏ లోకి మార్చుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వై శివ, ముదిరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల గణేష్, మీడియా ఇన్ఛార్జ్ కావ్య, తెలంగాణ ముదిరాజ్ మహాసభ కొడంగల్ ఉపాధ్యక్షులు నెల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.

AKRAM PASHA , KODANGAL

AKRAM PASHA , KODANGAL

Next Story