Amangal: ప్రతి వార్డును పచ్చదనంతో నింపుతాం: ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్

Amangal: మున్సిపాలిటీ 8వ వార్డులో వన మహోత్సవం జరిగింది. ప్రతి వార్డులో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనంతో నింపుతామని మున్సిపల్ చైర్మన్ ఎన్. పత్య నాయక్ తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Updated on: 7 Aug 2026 11:35 PM IST
Amangal
X

Amangal: ప్రతి వార్డును పచ్చదనంతో నింపుతాం: ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్

ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డును పచ్చదనంతో నింపేందుకు విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ ఎన్. పత్య నాయక్ తెలిపారు. శుక్రవారం 8వ వార్డులో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నేడు నాటే మొక్కలే రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయని అన్నారు. ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో దశలవారీగా మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించి పచ్చదనాన్ని పెంపొందిస్తామని తెలిపారు.

8వ వార్డు కౌన్సిలర్ ఎ. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ఎం. వెంకటయ్య, 12వ వార్డు కౌన్సిలర్ ఎన్. జగన్ పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వికాస్, ఏఈ నరేష్, మేనేజర్ ఆంజనేయులు, మున్సిపల్ సిబ్బంది రమేష్, రామకృష్ణ, షర్ఫుద్దీన్, పారిశుధ్య కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story