Malkajgiri: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజాప్రతినిధుల గరం!

Malkajgiri: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, వర్షాకాల ముందస్తు చర్యలపై ఎంపీ ఈటెల, ఎమ్మెల్యేల కీలక సమీక్ష సమావేశం.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 21 May 2026 3:49 PM IST
Malkajgiri
X

Malkajgiri: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజాప్రతినిధుల గరం!

మల్కాజ్గిరి: ఎల్బీనగర్ అల్కాపురి లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, MMC కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.

MMC పరిధిలో రోడ్ల విస్తరణ, కొత్తగా రానున్న ఫ్లైఓవర్లు, ఫుట్ పాత్ ల ఆక్రమణ, శానిటేషన్, నాళాల నిర్వహణ తో పాటు ఇతర అంశాలపై చర్చ రానున్న వర్షాకాలంలో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై డిస్కషన్. తమ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ ను పూర్తి చేయాలని కమీషనర్ ను కోరిన ఎమ్మెల్యేలు

ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన ముఖ్యాంశాలు

చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మేడ్చల్ మాట్లాడుతూ

- జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను రాంకీ సంస్థ 2004లో దత్తత తీసుకున్నప్పటికీ సరైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

- రూ.144 కోట్లతో టాపింగ్, వాటర్ ఫిల్టర్, కరెంట్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదన్నారు.

- రాంకీ సంస్థ కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

- చెత్త డంపింగ్ యార్డులను ఒకే చోట కాకుండా ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

- జవహర్ నగర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని అక్కడి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ & ప్రభుత్వ విప్ మాట్లాడుతూ

- రేపు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అన్ని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

- ప్రజాప్రతనిధుల సూచనలు, సలహాలతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు

శ్రీమతి సబితా ఇంద్రారెడ్డీ మాట్లాడుతూ

- నగర పరిధిలో వివిధ ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

- వర్షాకాలం సమీపిస్తున్నందున మహేశ్వరం నియోజకవర్గంలోని ఎస్‌ఎన్‌డీపీ నాలాల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

- పనులు ఆలస్యమైతే వరద ప్రభావం ఎల్బీనగర్ ప్రాంతంపై పడే ప్రమాదం ఉందన్నారు.

- మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఫండ్స్ లేవని పనులు నిలిపివేస్తున్నారని విమర్శించారు.

- రాబోయే వర్షాకాలంలో సీవరేజ్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

డి. సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎల్బీనగర్ మాట్లాడుతూ

జవహర్ నగర్ & కాలుష్య సమస్య

- రాష్ట్ర ప్రజలందరూ టాక్స్ చెల్లిస్తున్నా కాలుష్య భారం మాత్రం జవహర్ నగర్ ప్రజలే భరిస్తున్నారని అన్నారు.

- అక్కడి కాలుష్యం కారణంగా గర్భిణీలకు కూడా తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు.

- జవహర్ నగర్ ప్రజలకు కనీసం టాక్స్ మరియు వాటర్ బిల్లులు మాఫీ చేయాలని కోరారు.

వరదలు & నాలాల సమస్య

- పాహాడి షరీఫ్ నుండి సరూర్‌నగర్ చెరువుకు స్టార్మ్ వాటర్ రావడంతో కాలనీలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు.

- తక్షణమే వరద నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

- బండ్లగూడ చెరువును బ్యూటిఫికేషన్ చేయాలని సూచించారు.

ట్రాఫిక్ & రోడ్ల అభివృద్ధి

- సిఎం రోడ్ – సరూర్‌నగర్ పాత విజయవాడ హైవే రోడ్ విస్తరణ చేపట్టాలని కోరారు.

- టీకేఆర్ కమాన్ వద్ద ఫ్లైఓవర్ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, హస్తినాపురం – బి.ఎన్.రెడ్డి చౌరస్తా వరకు తీవ్ర ట్రాఫిక్ ఉందని అక్కడే ఫ్లైఓవర్ అవసరమన్నారు.

- ఆనంద్ నగర్ చౌరస్తా మరియు నాగోల్ డివిజన్‌లో కూడా ఫ్లైఓవర్లు నిర్మించాలని సూచించారు.

- హస్తినాపురం జెడ్పీ రోడ్ తెలంగాణ చౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కోరారు.

వీధి కుక్కలు & ప్రజా భద్రత

- వీరన్నగుట్ట, హస్తినాపురం టీచర్స్ కాలనీలలో చిన్నారులపై వీధి కుక్కల దాడులు జరిగాయని తెలిపారు.

- వీధి కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎస్‌ఎన్‌డీపీ & పైప్‌లైన్ పనులు

- ద్వారక తిరుమల నగర్‌లో పైప్‌లైన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

- యాకూత్‌పురా నుండి సింగరేణి కాలనీ వరకు మాత్రమే ఎస్‌ఎన్‌డీపీ పనులు జరిగాయని, మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలని కోరారు.

టౌన్ ప్లానింగ్ అవినీతి

- జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో తీవ్ర అవినీతి ఉందని ఆరోపించారు.

- మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని విమర్శించారు.

ఇతర సమస్యలు

- మన్సూరాబాద్ నుంచి ప్రారంభమయ్యే పాత జడ్పీ రోడ్డును ఫారెస్ట్ అనుమతులతో వెంటనే ప్రారంభించాలని కోరారు.

- దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో రోడ్ల వెంట వ్యభిచారం పెరుగుతోందని, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

- రాజకీయ నాయకులకు ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలని సూచించారు

మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్కాజిగిరి మాట్లాడుతూ

జవహర్ నగర్ & మౌలిక వసతులు

- రాంకీ సంస్థ ఇక్కడ సంపాదించిన డబ్బును ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చు చేస్తోందని ఆరోపించారు.

- హిందూ స్మశానవాటికల అభివృద్ధిని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

పారిశుద్ధ్యం & యంత్రాలు

- నియోజకవర్గంలో కేవలం 5 జేసీబీలు మాత్రమే ఉన్నాయని, వాటి సంఖ్య పెంచాలని కోరారు.

- జెట్టింగ్ మిషన్ల పనితీరును అధికారులు పరిశీలించాలని సూచించారు.

- కేవలం 30 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

- చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగి దోమలు అధికమయ్యాయని, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

- శానిటేషన్ వర్కర్ల సంఖ్య పెంచాలని, ఖాళీగా ఉన్న 50 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

స్టిల్ట్ & డ్రెయినేజ్ సమస్యలు

- స్టిల్ట్ మరియు డ్రెయిన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

- రైల్వే బ్రిడ్జిల వద్ద స్టిల్ట్ పేరుకుపోవడంతో కాలనీలు మునిగే పరిస్థితి ఉందన్నారు.

- మండచెరువులో రూ.3 కోట్లతో స్టిల్ట్ తొలగించినా ప్రయోజనం లేకపోయిందని, మళ్లీ తొలగించాలని కోరారు.

అభివృద్ధి పనులు

- CMRP కింద ప్రతిపాదించిన 29 రోడ్ల అభివృద్ధికి వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని కోరారు.

- వైకుంఠధామాలు లేని ప్రాంతాల్లో గ్రేవ్‌యార్డులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

- గౌతమ్ నగర్‌లో రాక్ గార్డెన్ ఏర్పాటు చేయాలని కోరారు.

- ఏకలవ్య నగర్‌లో UPHC భవనాన్ని మంజూరు చేయాలని కోరారు.

ఈటెల రాజేందర్ MP Malkajgiri మాట్లాడుతూ

1. మల్కాజిగిరి కమిషనర్ పరిధిలో సీసీ కెమెరాలు చాలా తక్కువగా ఉన్నాయని, మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

2. దేవాలయాల పక్కనే వైన్స్ షాపులు మరియు సిట్టింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

3. యువత డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

4. మంచి నీటి పైప్‌లైన్లు మరియు మురికి నీటి పైప్‌లైన్లు కలుస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

5. చాలా ప్రాంతాల్లో రోడ్లు లేవని, వాటి నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

6. జవహర్ నగర్ డంపింగ్ యార్డును వెంటనే అక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు.

ప్రజాప్రతినిధులు & జేఏసీ సభ్యులు మాట్లాడుతూ

- రాంకీ సంస్థ ఒప్పందం ప్రకారం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణలో పనిచేయడం లేదని విమర్శించారు.

- జవహర్ నగర్ ప్రజలకు ఉచిత నీరు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.

- డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చిన ఆదాయంలో చుట్టుపక్కల మున్సిపాలిటీలకు వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు.

- ఇక్కడ సంపాదించిన డబ్బును ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

- రాంకీ సంస్థ ప్రజలకు ఉపయోగపడకుండా ఇబ్బందులు కలిగిస్తోందని తెలిపారు.

- ప్రపంచ కాలుష్య ప్రాంతాల్లో జవహర్ నగర్ నాలుగో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

- రాంకీ సంస్థ చెప్పేది ఒకటి, చేసేది మరొకటని విమర్శించారు.

- రేపు ఉదయం 09:00 గంటలకు మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో MP ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను సందర్శించి సమస్యలను పరిశీలించనున్నట్లు తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story