Hyderabad: రాజీవ్ గృహకల్పలో ప్రజా ఆగ్రహం.. డ్రైనేజీ సమస్యలపై ధర్నా
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై స్థానికులు రోడ్డెక్కారు.
Hyderabad: రాజీవ్ గృహకల్పలో ప్రజా ఆగ్రహం.. డ్రైనేజీ సమస్యలపై ధర్నా
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప (పింక్ క్వార్టర్స్)లో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ సమస్యలపై స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు.
ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేకపోవడంతో కాలనీవాసులు ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గృహకల్ప నివాసితులు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




