Malkajgiri: మైనంపల్లి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి

Malkajgiri: మైనంపల్లి హనుమంత్ రావు నాయకత్వంలో నేరేడ్‌మెట్ తాజా మాజీ కార్పొరేటర్ భర్త కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి.

Bodike Manohar, Malkajgiri
Published on: 4 Sept 2026 6:26 PM IST
Malkajgiri
X

Malkajgiri: మైనంపల్లి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి

మల్కాజ్గిరి: ప్రజానాయకుడు మైనంపల్లి హనుమంత్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో నేరేడ్‌మెట్ తాజా మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి భర్త కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మైనంపల్లి హనుమంత్ పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవడంతో పాటు కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా ఆదరించే ఆయన నాయకత్వం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.

మాటలకే పరిమితం కాకుండా చేతలతో ప్రజాసేవకు నిదర్శనంగా నిలుస్తున్న మైనంపల్లి హనుమంత్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నేరేడ్‌మెట్‌లో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఉపేందర్ రెడ్డి తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారం,కార్యకర్తలకు అండగా నిలవడం, ప్రజలకు అందుబాటులో ఉండటమే మైనంపల్లి హనుమంత్ నాయకత్వ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం,ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story