Tarnaka: 'ఏ కాంప్రహెన్సివ్ బుక్ ఆన్ ఆఫీస్ కరస్పాండెన్స్' పుస్తకాన్ని ఆవిష్కరించిన రామచందర్!

Tarnaka: తార్నాకలో అబ్బూరి వెంకటరమణ రచించిన 'ఏ కాంప్రహెన్సివ్ బుక్ ఆన్ ఆఫీస్ కరస్పాండెన్స్' పుస్తకాన్ని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు ఆవిష్కరించారు.

HARISH, TARNAKA
Published on: 5 Nov 2026 10:27 AM IST
Tarnaka
X

Tarnaka: 'ఏ కాంప్రహెన్సివ్ బుక్ ఆన్ ఆఫీస్ కరస్పాండెన్స్' పుస్తకాన్ని ఆవిష్కరించిన రామచందర్!

Tarnaka: ప్రభుత్వ పరిపాలన విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ‘ఏ కాంప్రహెన్సివ్ బుక్ ఆన్ ఆఫీస్ కరస్పాండెన్స్’ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు.

తార్నాకలోని తన నివాసంలో అబ్బూరి వెంకటరమణ రచించిన ఈ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేయడంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పుస్తకం ద్వారా అనువాద ప్రక్రియ సులభతరం అవుతుందని పేర్కొన్నారు.

గతంలో అబ్బూరి వెంకటరమణ న్యాయవాదులకు ఉపయోగపడే పుస్తకాన్ని రచించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రయోజనం చేకూర్చేలా ఆఫీస్ కరస్పాండెన్స్‌పై సమగ్ర పుస్తకాన్ని రచించడం అభినందనీయమని రామచందర్ రావు ప్రశంసించారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA