Nacharam: నాచారం భవాని నగర్‌లో ఎట్టకేలకు సీసీ రోడ్డు పనులు ప్రారంభం!
Nacharam: నాచారం భవాని నగర్‌లో డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత సుమారు రూ.40 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
Nacharam: నాచారం భవాని నగర్‌లో ఎట్టకేలకు సీసీ రోడ్డు పనులు ప్రారంభం!
నాచారం: నాచారం భవాని నగర్‌లో సుమారు 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులు పలు కారణాల వల్ల కొంతకాలంగా ఆలస్యమయ్యాయి. డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ఎట్టకేలకు సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా భవాని నగర్ స్ట్రీట్ నంబర్ 3లో జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ స్థానిక కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే స్ట్రీట్ నంబర్ 4తో పాటు మిగిలిన వీధుల్లో కూడా సిమెంట్ రోడ్లు నిర్మాణం జరుగుతుందని, అవసరమైన కనెక్టింగ్ రోడ్లను కూడా ఏర్పాటు చేస్తారని సాయిజెన్ శేఖర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాగిరి మోహన్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, సురేందర్, కట్ట బుచ్చన్న గౌడ్, శేఖర్ రెడ్డి, సంతోష్ రవీందర్ సంపత్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




