Nacharam: సాయినగర్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనుల పర్యవేక్షణ
Nacharam: నాచారం హెచ్‌ఎంటీ నగర్ డివిజన్ సాయినగర్ కాలనీలో రూ. 9 లక్షలతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్.
Nacharam: సాయినగర్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనుల పర్యవేక్షణ
నాచారం: హెచ్ఎంటి నగర్ డివిజన్ సాయినగర్ కాలనీలో రూ.9 లక్షల వ్యయంతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు రావూఫ్ అదనంగా 20 పైపులు అవసరమున్నట్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో వెంటనే స్పందించిన సాయిజెన్ శేఖర్ జలమండలి మేనేజర్ రోహిత్‌తో ఫోన్‌లో మాట్లాడి అదనంగా 20 పైపులు సమకూర్చాలని కోరారు.
డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి కాలనీవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రావూఫ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.




