Nacharam: రాఘవేంద్ర నగర్‌లో మంచినీటి సమస్యపై సాయిజెన్ శేఖర్ చొరవ

Nacharam: నాచారం హెచ్‌ఎంటీ నగర్ పరిధిలోని రాఘవేంద్ర నగర్‌లో నెలకొన్న మంచినీటి సమస్యపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ జలమండలి అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపారు.

HARISH, TARNAKA
Published on: 11 Oct 2026 2:19 PM IST
Nacharam
X

Nacharam: రాఘవేంద్ర నగర్‌లో మంచినీటి సమస్యపై సాయిజెన్ శేఖర్ చొరవ

నాచారం: హెచ్‌ఎంటీ నగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్, ప్లంబర్ కృష్ణ లైన్‌లో నెల రోజులుగా నెలకొన్న మంచినీటి సరఫరా సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ చొరవ తీసుకున్నారు. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బస్తీవాసులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.

బస్తీవాసుల సమస్యపై వెంటనే స్పందించిన సాయిజెన్ శేఖర్.. జలమండలి ఏఈ రోహిత్, డీజీఎం వేణుగోపాల్‌తో ఫోన్‌లో మాట్లాడి నీటి సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న వాల్‌ను తక్షణమే మరమ్మతు చేసి, బస్తీలో మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించి, బస్తీవాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నరసింహారావు, రాజు పటేల్, నరసింహులు గౌడ్, గులాం హుస్సేన్, షేక్ హైదర్, ప్లంబర్ కృష్ణ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA