Nacharam: నాచారంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

Nacharam: నాచారం దుర్గానగర్ శివాలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవం.

HARISH, TARNAKA
Published on: 27 Jun 2026 4:21 PM IST
Nacharam
X

Nacharam: నాచారంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

నాచారం: నాచారం దుర్గానగర్ శివాలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠతో పాటు నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితులు జజ్ఞ హోమ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ నామస్మరణతో ప్రాంగణం మారుమోగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి. ఎస్. ప్రకాష్ రెడ్డితో పాటు కుమారుడు వి.ఎస్. చరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా వారు దేవాలయ అభివృద్ధి కోసం రూ. 51,101/- విరాళంగా అందజేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story