Nacharam: డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో గణేశ్ చతుర్థి వేడుకలు!
Nacharam: నాచారం డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో భక్తిశ్రద్ధలతో గణేష్ చతుర్థి వేడుకలు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించిన స్కూల్ యాజమాన్యం.
Nacharam: డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో గణేశ్ చతుర్థి వేడుకలు!
Nacharam: నాచారం లోని డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో గణేశ్ చతుర్థి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం గణేశ్ వందన, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ నవనీతరావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్, డైరెక్టర్ డాక్టర్ కమల మనోహర్ రావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, ప్రకృతితో సమన్వయం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పర్యావరణహితంగా పండుగలను నిర్వహిస్తూ సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వర్ణ అక్కినేని మాట్లాడుతూ, గణేశ్ చతుర్థి వేడుకలను విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తి గీతాలు, సాంస్కృతిక నృత్యాలు, కళాత్మక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కోర్ హెడ్ ఆపరేషన్స్ కిషోర్ కుమార్ రెడ్డి, కోర్ టీమ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




