Nacharam: నాచారంలో ఘనంగా దసరా, బతుకమ్మ సంబరాలు

Nachara: నాచారంలోని డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో విద్యార్థులు బతుకమ్మ, దసరా వేడుకలను దాండియా, నృత్య ప్రదర్శనలతో ఘనంగా నిర్వహించారు.

HARISH, TARNAKA
Published on: 11 Oct 2026 5:03 PM IST
Nacharam
X

Nacharam: నాచారంలో ఘనంగా దసరా, బతుకమ్మ సంబరాలు

నాచారం: నాచారంలోని డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో దసరా, బతుకమ్మ వేడుకలను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. దాండియా, నృత్య ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్‌ కె. నవనీతరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ఫణి మాధవి మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించడమే దసరా పండుగ సందేశమని పేర్కొన్నారు.

విద్యార్థులు కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునికతను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు పాఠశాల కృషి చేస్తుందని తెలిపారు.

దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోర్‌ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ కిషోర్‌ కుమార్‌రెడ్డి, ప్రైమరీ వైస్‌ ప్రిన్సిపాల్‌, కో-ఆర్డినేటర్‌ రాధిమ, ఉపాధ్యాయులు, కోర్‌ టీమ్‌ సభ్యులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA