Nacharam: నాచారంలో పల్స్ పోలియో.. పోలియో రహిత సమాజానికి కృషి
Nacharam: నాచారం భవానీనగర్ కమ్యూనిటీ హాల్లో పల్స్ పోలియో కార్యక్రమం; ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని రాగిరి మోహన్ రెడ్డి సూచన.
Nacharam: నాచారంలో పల్స్ పోలియో.. పోలియో రహిత సమాజానికి కృషి
నాచారం: చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాచారం డివిజన్ భవానీ నగర్ కాలని అధ్యక్షుడు రాగిరి మోహన్ రెడ్డి సూచించారు.
నాచారం డివిజన్ పరిధిలోని భవానీనగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. చిన్నారులకు రెండు చుక్కల పోలియో మందు వేసి పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఆనంద్ కుమార్, శ్రీనివాస్, వీర ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వారు సూచించారు.




