Nagaram: బీఆర్‌ఎస్ ధర్నా 420 ఫీట్ల బ్యానర్‌తో మల్లారెడ్డి భారీ ర్యాలీ!
Nagaram: కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు నిరసనగా నాగారంలో బీఆర్‌ఎస్ ధర్నా. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో 420 ఫీట్ల బ్యానర్‌తో ర్యాలీ, బాకీ కార్డుల పంపిణీ.
Nagaram: బీఆర్‌ఎస్ ధర్నా 420 ఫీట్ల బ్యానర్‌తో మల్లారెడ్డి భారీ ర్యాలీ!
Nagaram: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, కందాడి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి నాగారంలోని రాంపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు 420 ఫీట్ల బ్యానర్ తో ర్యాలీ నిర్వహించారు.
మంత్రి పొంగులేటి 22ఏ తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర మంత్రి కాక భారతదేశం మంత్రిగా ఉంటే భారతదేశాన్ని మొత్తం అమ్మేవాడని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలన దగా పాలనని ప్రజలకు ఎలాంటి న్యాయం జరగట్లేదని కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసం చేశారు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని చెప్పారు మోసం చేశారు.
తులం బంగారం ఇస్తామని మోసం చేశారుతెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఉండే ప్రపంచంలో ఎంతో పెద్దదైన కాలేశ్వరం కట్టి చెరువులండి ఎండాకాలంలో కూడా నీరుతో నిండి ఉండేది ఇప్పుడు మొత్తం ఎండిపోయింది రెండు పిల్లర్ల కృంగిపోయాయని వంకతో రైతులను మోసం చేశారని ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారని పదవుల కోసం ఢిల్లీలో పోటీ పడుతున్నారని రాబోయే రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నాగారం టిఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్, మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు చిన్నం రాజు సాయినాథ్ గౌడ్ , గూడూరు ఆంజనేయులు గౌడ్, వెంకటేష్, గండి అంజయ్య గౌడ్, రామారావు వినోద్ గౌడ్, జలాల్పురం సుధాకర్ రెడ్డి, కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




