Kalwakurthy: కల్వకుర్తిలో కన్నులపండువగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు!

Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరిగాయి. అమ్మవారు అర్ధనారీశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 12 Oct 2026 9:55 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో కన్నులపండువగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు!

కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పట్టణములోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం వాసవి మాత భక్తులకు అర్ధనారీశ్వరి రూపంలో దర్శనమిచ్చారు.

పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు తరలివచ్చి వేడుకలలో పాల్గొన్నారు. ఆవోప ఆధ్వర్యంలో అమ్మవారికి తిలకదరణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు. సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు నిర్వహించిన నృత్య కళా ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జూలూరు రమేష్ బాబు మాట్లాడుతూ 37 సంవత్సరాలుగా ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దసరా సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు హాజరై భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నామని చెప్పారు.

2500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్, కార్యదర్శిలు నారాయణరాజు, పానుగంటి నవీన్, కోశాధికారులు గుబ్బ కిషన్, వాసా మనీష్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాసా శేఖర్, ఆవోప అధ్యక్షుడు కల్మచర్ల రాఘవేందర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY