Kalwakurthy: కల్వకుర్తిలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి నవరాత్రులు!
Kalwakurthy: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. బీజేపీ నేత ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
Kalwakurthy: కల్వకుర్తిలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి నవరాత్రులు!
కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి భక్తులు భజనలు చేశారు. మ్యాజిక్ షో, స్వర్ణభారతి కళానిలయం ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన సంప్రదాయాలను గౌరవించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. భక్తులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు తెలిపారు. ఇప్పటివరకు 3,000 మందికి అన్నదానం చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు నారాయణరాజు, పానుగంటి నవీన్, కోశాధికారులు గుబ్బ కిషన్, వాస మనీష్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాదం రాఘవేందర్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వాసా శేఖర్, చిగుళ్లపల్లి శ్రీధర్, గుగ్గిల శంకర్, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గోవిందు మౌనిక, కల్మిచర్ల స్వాతి తదితరులు పాల్గొన్నారు.




