Hyderabad: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సాకుతో కేంద్రం పెట్రో ధరల దోపిడీ
Hyderabad: విద్వేషపూరిత పోస్టులపై నిఘా ఉంచేందుకు పోలీసులు 'సాక్ ఐ' (SOC EYE) వ్యవస్థను తెచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
Hyderabad: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సాకుతో కేంద్రం పెట్రో ధరల దోపిడీ
హైదరాబాద్: సోషల్ మీడియాను మిస్‌యూజ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పనిగట్టుకుని దృష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాటినన్నింటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు "సాక్ ఐ" అనే మానిటరింగ్ వ్యవస్థగా తీసుకొచ్చిందన్నారు. సోషల్ మీడియాలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని , ప్రజలు కూడా దానిపై అవగాహన పెంపొందించుకోవాలని దానం సూచించారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు , తప్పుడు ప్రచారం (ఫేక్ న్యూస్) , శాంతిభద్రతలకు భంగం కలిగించే కంటెంట్ లపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని కోరారు.
హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బోనాల పండుగకు సంబంధించిన చెక్కులను ఆలయాల నిర్వాహకులకు దానం అందజేశారు. అలాగే ప్రతిసారి ఎన్నికల తరువాత పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచే ఆనవాయితీను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని దానం అన్నారు. ఎన్నికల ముందు నజరానాలు ప్రకటించి , ఎన్నికల తరువాత సామాన్యులపై పెను భారం మోపుతున్నారని విమర్శించారు. ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య యుద్దని సాకుగా చూపెడుతూ... ధరలను పెంచుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని , లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురవుతారని దానం నాగేందర్ హెచ్చరించారు.




