Nagole: పెద్ద అంబర్‌పేట్‌లో సీసీ రోడ్డు పనుల పరిశీలన

Nagole: పెద్ద అంబర్‌పేట్ హరితహారం కాలనీలో రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కౌన్సిలర్ బొర్ర అనురాధ సురేష్. నాణ్యత పాటించాలని సూచన.

AJAY, HAYATH NAGAR
Published on: 28 July 2026 6:41 PM IST
Nagole
X

Nagole: పెద్ద అంబర్‌పేట్‌లో సీసీ రోడ్డు పనుల పరిశీలన

నాగోల్: నాగోల్ సర్కిల్ 52వ డివిజన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ హరితహారం కాలనీలో, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి మాజీ కౌన్సిలర్ బొర్ర అనురాధ సురేష్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో మాట్లాడిన ఆమె, నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే కాలనీవాసులకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని పేర్కొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story