Nagole: 74 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ట్రాఫిక్ డీసీపీ
Nagole: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ చేపట్టిన ‘నేను సైతం 2.0’లో భాగంగా నాగోల్ పరిధిలో ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 74 సీసీటీవీ కెమెరాలను ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ ప్రారంభించారు.
Nagole: 74 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ట్రాఫిక్ డీసీపీ
నాగోల్: నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ చేపట్టిన ‘నేను సైతం 2.0’ కార్యక్రమం మరింత వేగంగా కొనసాగుతోంది. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 74 సీసీటీవీ కెమెరాలను ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ బి. శ్రీనివాసులు, నాగోల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ బుధవారం ప్రారంభించారు.
కృషినగర్‌లోని పల్లవి డీబీఆర్ అపార్ట్‌మెంట్స్‌లో 30 కెమెరాలు, రాఘవేంద్రనగర్ కాలనీ, తట్టి అన్నారం డబుల్ బెడ్‌రూమ్, అన్నవరపు సత్యనారాయణ కాలనీల్లో మరో 44 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద కదలికలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిరంతర నిఘా కొనసాగనుంది.
ఈ సందర్భంగా డీసీపీ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘నేను సైతం 2.0’ ద్వారా ఇప్పటివరకు 2,58,457 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్‌బీనగర్ జోన్ పరిధిలోనే 81,183 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కెమెరాల ఏర్పాటులో ఎల్‌బీనగర్ జోన్‌కు చెందిన 104 మంది ప్రజలు భాగస్వాములయ్యారని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న సీసీటీవీ కెమెరాలు నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, కేసుల దర్యాప్తు, ప్రజల భద్రతకు కీలకంగా ఉపయోగపడుతున్నాయని డీసీపీ తెలిపారు. సీసీటీవీ నిఘా విస్తరించడంతో శాంతిభద్రతలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
అదేవిధంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డీసీపీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
కార్యక్రమంలో ఎల్‌బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ బి. నవీన్‌రెడ్డి, ఎస్‌ఐలు పి. శివనాగ ప్రసాద్, ఉమ, రాఘవేంద్రనగర్ కాలనీ, తట్టి అన్నారం డబుల్ బెడ్‌రూమ్, అన్నవరపు సత్యనారాయణ కాలనీ ప్రతినిధులు, అపార్ట్‌మెంట్ వాసులు డాక్టర్ విష్ణు, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, శ్రీరాములు, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.




