LB Nagar: నాగోల్ పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

LB Nagar: నాగోల్ పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎల్బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు. రూ.17 వేల జరిమానా, బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 10 Oct 2026 10:53 AM IST
LB Nagar
X

LB Nagar: నాగోల్ పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

LB Nagar: నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించింది. నిందితుడికి రూ.17,000 జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.

నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2020లో క్రైమ్‌ నంబర్‌ 1173/2020గా నమోదైన ఈ కేసులో గుంజి కోటేశ్వరరావు (28) నిందితుడిగా ఉన్నాడు. ఐపీసీ సెక్షన్లు 366, 376(2)(n), 342, 493, 506తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(l) రెడ్‌ విత్‌ 6 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఎస్సీ నంబర్‌ 409/2021గా విచారణకు వచ్చింది.

ఈ కేసులో పోలీసుల తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించగా, ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన అధికారులు, సిబ్బంది సహకరించారు.

దర్యాప్తు అధికారులు: ఇన్‌స్పెక్టర్‌ వి. అశోక్‌రెడ్డి, ఏసీపీ పి. శ్రీధర్‌రెడ్డి ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు డి. రఘు, పి. సత్యనారాయణ, కృష్ణ ప్రసన్న హాజరయ్యారు.

నాగోల్‌ పోలీసుల వివరాల ప్రకారం, ఈ కేసులో న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం మంజూరు చేయాలని ఆదేశించింది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR