Nagole: రమానంద కాలనీలో 'నేను సైతం 2.0' సీసీటీవీలు ప్రారంభం
Nagole: మల్కాజిగిరి కమిషనరేట్ "నేను సైతం 2.0"లో భాగంగా నాగోల్ రమానంద కాలనీ నివాసులు స్వచ్ఛందంగా 16 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.
Nagole: రమానంద కాలనీలో 'నేను సైతం 2.0' సీసీటీవీలు ప్రారంభం
నాగోల్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వినూత్నంగా చేపట్టిన "మీ సురక్ష" కార్యక్రమంలోని "నేను సైతం 2.0" కార్యక్రమం కింద నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రమణంద కాలనీలో కాలనీ వాసులు స్వచ్ఛందంగా తమ సొంత ఖర్చుతో 16 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ చేతుల మీదుగా సీసీటీవీ కెమెరాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, నేరాల ఛేదన, ప్రజల భద్రతకు సీసీటీవీ కెమెరాలు ఎంతో కీలకమైనవని తెలిపారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, వ్యాపార సంస్థల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నివారించడంతో పాటు నేరస్తులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని వివరించారు.
ప్రజల భాగస్వామ్యంతో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన రమణంద కాలనీ నివాసులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ బి. ఉమ మరియు రమణంద కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ R.S.R.A. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీ D.S.R. మూర్తి, కోశాధికారి శ్రీ హనుమంతరావు తదితర కాలనీ ప్రతినిధులు, నివాసులు పాల్గొన్నారు.




